స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశమయ్యారు.బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి,సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్,బీసీ నాయకులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇప్పటివరకు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల గురించి కేటీఆర్ బీసీ ప్రముఖులతో చర్చించారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్,మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ ఏల్.రమణ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్,చింతా ప్రభాకర్,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధుకర్, బూడిద భిక్షమయ్య గౌడ్,నోముల భగత్,నాయకులు ఆంజనేయ గౌడ్,క్యామా మల్లేష్,కోతి కిశోర్ గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.