






ఏదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం
మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ఎస్ విజయ్ మాట్లాడుతూ ఏధిలాపురం మున్సిపాలిటీలో ప్రజలు అనేక సమస్యలకు గురి అవుతున్నారు కనీస మౌలిక సదుపాయాలు అయిన సిసి రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు మిషన్ భగీరథ రైతు బజారు గ్రంథాలయం మినీ స్టేడియం వాకింగ్ ట్రాక్ మక్కా పురుగుల నిర్మూలన మొదలగు సమస్యలను ఈ సమావేశం నందు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎర్రమల శ్రీనివాసరావు సంఘ కార్యదర్శి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీ సమస్యలను ఏకరవు పెట్టారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ అధ్యక్షులు తెలంగాణ జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వివక్షతకు గురి అయి అభివృద్ధికి నోచుకోని ఖమ్మం రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలను ఎదులాపురం పరిధిలోని 50 వెంచర్లను కలుపుతూ ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పరిచిన రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉంది అని గుర్తు చేశారు. ఆర్టిఐ కమిషనర్ పివీ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని ప్రజలు కనీస అవసరాలు కోరుకుంటున్నారు అందించాల్సిన బాధ్యత పాలకులది ప్రభుత్వాలది అని అవి సాధించుట కొరకు ప్రజానీకం ఉద్యోగస్తులు పోరాటాల ద్వారానే సాధించుకోవాలి అని కోరినారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ నేను పాలేరు నియోజకవర్గం నకు చెందిన వాడిని ఈ సంఘానికి ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందించడానికి సిద్ధంగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నా దగ్గరికి రావచ్చు అని చెప్పారు మక్కా పురుగుల నిర్మూలన తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏదులాపురాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌర మంత్రివర్యులు పెట్టుకొని ఎదులపురాని మున్సిపాలిటీగా మార్చి దేశంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు రచించారు అవి పూర్తి చేస్తారు అని హామీ ఇచ్చారు…. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు , ఉద్యోగ సంఘం జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు గుంటపల్లి శ్రీనివాస్ కష్టాల సత్యనారాయణ అధ్యక్షులు కార్యదర్శులు వర్ష పుల్లయ్య రవికుమార్, మోదుగు వేలాద్రి, గౌరవ అధ్యక్షులు ఊడుగు వెంకటేశ్వర్లు అసోసియేట్ అధ్యక్షులు బి శోభన్ జమ్మి జయపాల్, కిషన్ నాయక్ దరావత్ రాములు ఎన్.శంకర్ కోశాధికారి గందసరి మల్లయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి వై దేవయ్య ప్రచార కార్యదర్శి పేరుమాలపల్లి శ్రీనివాసులు మహిళా కార్యదర్శి డి నాగమణి రాణి శ్రీదేవి ఉపాధ్యక్షులు కార్యదర్శులు టి వెంగళరావు మద్ది పుల్లయ్య గుండ మధుకర్ రెడ్డి తెగుళ్ల శ్రీనివాస్ గుంటి మల్లికార్జున్ జె వీరన్న వై సాయిబాబా, కిషన్ నాయక్ రాముడు నాయక్ సుంకర శ్రీనివాస్ మొదలుగువారు పాల్గొన్నారు
