

భీమా సొమ్ము 10 లక్షల రూపాయల చెక్కు నామినికు అందజేత… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
*2087 మల్టీ పర్పస్ వర్కర్లకు పోస్టల్ గ్రూపు ప్రమాద బీమా కల్పన
ఖమ్మం ఆగస్టు 4 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు))
ప్రమాదవశాత్తు మరణించిన మల్టీ పర్పస్ వర్కర్ కు సంబంధించిన భీమా సొమ్ము 10 లక్షల రూపాయల చెక్కును నామినికు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో మల్టీపర్పస్ వర్కర్ వీరస్వామి నామినికు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పది లక్షల రూపాయల భీమా చెక్కు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మల్టీ పర్పస్ వర్కర్లు గా పని చేస్తున్న 2087 మంది కార్మికులకు పోస్టల్ శాఖ ద్వారా ప్రమాద భీమా చేయించడం జరిగిందని, ఏప్రిల్ నెలలో ప్రమాదవశాత్తు మరణించిన మల్టీపర్పస్ వర్కర్ వీరస్వామి నామినీ జి. జమలమ్మకు నేడు ప్రమాద భీమా సొమ్ము 10 లక్షల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రమాద భీమా రెన్యువల్ సకాలంలో జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
