ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల తదితర ప్రముఖులతో కలిసి తెలంగాణ భవన్ లో
హైదరాబాద్ మన జ్యోతి డెస్క్




భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశం తెలంగాణ భవన్ లో బుధవారం జరిగింది.ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు,ఏల్.రమణ,ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్,పీ.విష్ణువర్థన్ రెడ్డి,దివంగత శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తదితర ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్వర్గీయ గోపీనాథ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సభికులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
