అమెరికా బిడ్డల ఆదరణ మరువలేను: వద్దిరాజు
– మున్నూరు కాపుల ఘన సన్మానం
ఖమ్మం, సెప్టెంబర్, 12: (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))
ఇటీవల అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని తొలిసారిగా ఖమ్మం విచ్చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఖమ్మం నగర మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించుకున్నారు. స్థానిక బురహాన్ పురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరుకాపు ప్రముఖులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరుకాపు నాయకుల సమక్షంలో ఎంపీ రవిచంద్రను భారీ గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ..ఇటీవల తన అమెరికా పర్యటనలో అక్కడి మున్నూరుకాపు బిడ్డలు చూపిన ఆదరణ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనని అన్నారు. కొద్ది రోజుల తన పర్యటనలో అందర్నీ కలవలేకపోయినందుకు బాధపడుతున్నానని అన్నారు. అమెరికాలో స్థిరపడ్డ మున్నూరు కాపులంతా అక్కడ కమ్యూనిటీ అవసరాల కోసం భవనాలు నిర్మించాలని తాను చేసిన సూచనకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ తోపాటు అక్కడి కుల బంధువులు అందరూ ఆమోదించారని గుర్తు చేశారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మున్నూరు కాపులు ఇతరులను గౌరవించడంలో ఎప్పుడు ముందుంటారని అన్నారు. బిసీ కులాల్లోని ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని పోతూ మున్నూరు కాపు కులాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ప్రముఖులు మేకల భిక్షమయ్య, పారా నాగేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాసరావు, కనకం జనార్ధన్, కార్పొరేటర్లు తోట రామారావు, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, మాటేటి రామారావు,
కాంగ్రెస్ నాయకులు పసుపులేటి వెంకట్ ,సిపిఐ నాయకులు మేకల శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేకల నాగేందర్, బీఆర్ఎస్ నాయకులు పిన్ని కోటేశ్వరరావు, యాసా రామారావు, గుళ్లపల్లి శేషగిరిరావు, ఎర్రా అప్పారావు, యూత్ నాయకులు తోట రమేష్, వివిధ నియోజకవర్గాల బాధ్యులు, మాధురి మధు, మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed