(( ఖమ్మం వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు సెప్టెంబర్ 12))

టీఎన్జీవోస్ మున్సిపల్ ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

ఈరోజు ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ నందు ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ మున్సిపల్ ఫోరం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం, మరియు ఖమ్మం నగర పాలక సంస్థ లలో వివిధ స్థానాలలో పనిచేస్తున్న సభ్యులు పాల్గొన్నారు. సింగిల్ సెట్ నామినేషన్ రావటంతో ఏకగ్రీవంగా మున్సిపల్ ఫోరం ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీఎన్జీవోస్ జాయింట్ సెక్రెటరీ తాళ్లూరి శ్రీకాంత్ ప్రకటించారు. ఎన్నిక అనంతరం జరిగిన కార్యక్రమానికి టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మున్సిపల్ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవంగా జరగటం సంతోషంగా ఉందని, అందరూ ఐక్యంగా ఉంటూ సభ్యుల సమస్యల పట్ల స్పందిస్తూ, వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ ఎల్లప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పారు.
టీఎన్జీవోస్ కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్సిపల్ ఉద్యోగులకు అనేక రకాల ఒత్తిడిలు, సమస్యలు వస్తుంటాయని, ప్రజలకు మంచి సేవలు అందిస్తూ, మున్సిపల్ ఉద్యోగులకు కూడా నూతన ఫోరం అండగా ఉండాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ కొమరగిరి దుర్గాప్రసాద్, టీఎన్జీవోస్ సెంట్రల్ కార్యదర్శి జెడ్. ఎస్. జైపాల్, టిఎన్జీవోస్ వైస్ ప్రెసిడెంట్లు యర్రా రమేష్, లలిత కుమారి, టిఎన్జీవోస్ నగర శాఖ అధ్యక్షులు ప్రభాకర చారి,రుక్మారావు, టీఎన్జీవోస్ నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

నూతన మునిసిపల్ ఫోరం బాధ్యులుగా ఈ క్రింది వారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అధ్యక్షులుగా ఏ.సుధాకర్, అసోసియేటెడ్ అధ్యక్షులుగా ఈ.ఉదయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు గా ఎం.శ్రీనివాస్, కె.లింగయ్య, జె. నాగరాజు,జె.సూచిత, సెక్రెటరీగా జి.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీలుగా ఎం.సాంబయ్య, సిహెచ్. శ్రీనివాస్, జె.రాంబాయి, ఏ.ప్రేమ్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ గా బి.నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా బి.సుధాకర్, పబ్లిసిటీ సెక్రెటరీ గా కె.శ్రీకాంత్, స్పోర్ట్స్ సెక్రటరీ గా అవినాష్, ఆఫీస్ సెక్రటరీ గా కే.హేమనాథ్ సాయి, కార్యవర్గ సభ్యులుగా ఎం.ప్రవీణ్ కుమార్, పి.రజిని, కృష్ణకుమారి, కవిత, అనురాధ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed