1లక్ష 30 వేల రూపాయల స్కాలర్షిప్పులను పేద పద్మశాలి విద్యార్థులకు మరియు వికలాంగులకు పంపిణీ

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు  నవంబర్ 2

పద్మశాలి ఉద్యోగుల ఆత్మీయ సమావేశం 14వ వార్షికోత్సవం సందర్భంగా డిఆర్పిసి భవనం నందు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం లక్ష రూపాయల స్కాలర్షిప్లను పేద పద్మశాలి పిల్లలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు . అలాగే ప్రతి సంవత్సరం పదవీ విరమణ మరియు పదోన్నతి పొందిన ఉద్యోగస్తులను సతి సమేతంగా సన్మానించుకోవడం జరుగుతుందన్నారు . ఈ సంవత్సరం వికలాంగులకు 30 వేల స్కాలర్షిప్ ను పంపిణీ చేశామని తెలియజేశారు . రాబోవు కాలంలో ఈ స్కాలర్షిప్ లను రెండు లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు . సంఘం ప్రధాన కార్యదర్శి మొరం మధు కుమార్ కార్యక్రమాన్ని అన్ని రంగాల్లో విజయం సాధించేలా కృషి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్థపు మురళి , రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జిల్లా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నారు కానీ రాజకీయంగా లేరని కావున పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని పేర్కొన్నారు . అనంతరం సుమారు 1లక్ష 30 వేల స్కాలర్షిప్పులను పేద పద్మశాలి విద్యార్థులకు మరియు వికలాంగులకు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అంచ నాగరాజు , మోతుకూరు జానకి రాములు , ఉదారి గోపాల్ రావు , బండారు వెంకన్న , అప్పని భాస్కరరావు , నాగుల కృష్ణమూర్తి , రచ్చ రామారావు , పిల్లలమర్రి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed