డిప్యూటీ సీఎం భట్టి ని కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు
ఖమ్మం మార్చి 8 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని , అభినందనలు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యండి. అబ్దుల్ హకీమ్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలుసుకొని , పుష్పగుచ్చాలు అందించి , ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు యం డి. అబ్దుల్ హకీమ్ ఉపముఖ్యమంత్రి భట్టి కు సంఘ సభ్యులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎండి. అబ్దుల్ హకీమ్ తో పాటు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి. పంతులు , అసోసియేటెడ్ అధ్యక్షుడు సుస్వేశ్వర రావు , ముఖ్య సలహాదారుడు ఎం. బాబురావు , జాయింట్ సెక్రటరీ జానీ మియా , ఉపాధ్యక్షులు యండి. రఫీ , పట్టణ అధ్యక్షులు అబ్బు రాములు తదితరులు ఉన్నారు.


