(( ఖమ్మం వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 31))










నిస్వార్థ సేవకు ఘన సన్మానం
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, డిప్యూటీ డైరెక్టర్ మరియు తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఖమ్మం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తొలి పలుకులు తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు , కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మధిర నియోజకవర్గం, పి శ్రీనివాసరెడ్డి అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ), టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి కొనేదన శ్రీనివాసరావు (బుల్లెట్ శీనన్న) ఎస్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు మరియు ఇతర అధికారులు అదేవిధంగా టీఈజేఏసీ, టి జి ఓ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన కస్తాల సత్యనారాయణ 1991 సెప్టెంబర్ 7న వాజేడు గ్రామంలో గ్రూప్ 2 వార్డెన్ గా ఉద్యోగ నియామకం జరిగింది ఉద్యోగ ప్రస్థానంలో అనేక పదోన్నతులు పొంది డిడి సోషల్ వెల్ఫేర్ గా పదవి విరమణ చేశారు విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్న కస్తాల సత్యనారాయణ జిల్లా అధికారుల చేత మనన్లు పొందారు తన ఉద్యోగ జీవితంలో వివిధ హోదాలలో అధికార బాధ్యతలు స్వీకరించి నిబద్ధత గల ప్రభుత్వాధికారిగా ప్రజలతో మమేకమై తోటి ఉద్యోగస్తులతో అభిమానంతో వ్యవహరిస్తూ సోషల్ వెల్ఫేర్ శాఖను ప్రజలకు చేరువచేయుటలో కీలకపాత్ర పోషించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటానికి అహర్నిశలు కృషి చేశారని అభినందించారు సంఘాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారని అభినందించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన సత్యనారాయణ వ్యవసాయం పట్ల కుటుంబ బంధాలకు ఎక్కువగా విలువలు ఇచ్చే వారిని అభినందించారు.
అడిషనల్ కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కస్తాల సత్యనారాయణ జిల్లా అధికారిగా విశేషమైన సేవలు అందించారని విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దటంలో ఘననీయమైన పాత్ర వహించారని భవిష్యత్తులో ఇదే సేవా గుణాన్ని కొనసాగించాలని చెప్పారు.
ఈ కార్యక్రమాన్నిదేశించి కస్తాల సత్యనారాయణ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమకు సహకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ గారికి షెడ్యూల్ క్యాస్ట్ జిల్లా కార్యాలయ సిబ్బందికి, వసతి గృహ సంక్షేమ అధికారులకు, తమ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఉద్యోగ విధి నిర్వహణలో తన కుటుంబ సభ్యుల యొక్క సహకారం మరువలేనిదని అర్ధాంగి శ్రీమతి వసంత గారిని తమ కుమారులను కోడళ్లను తమ అన్న వదినలను బావ కొండబాల కోటేశ్వరరావు గారి సహకారం వారి బావమరిది గారి సహకారం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీజీవో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంఘం వెంకట పుల్లయ్య, మహేష్, టీఎన్జీవో ఖమ్మం జిల్లా కార్యదర్శి కొనిదేన శ్రీనివాసరావు, రాష్ట్ర బాధ్యులు జయపాల్, అసోసియేట్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, కస్తాల వెంకటేశ్వరరావు, టీజీవో జిల్లా ట్రెజరర్ కొండపల్లి శేషు ప్రసాద్, టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి శ్రీనివాస్, టి సి ఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయకుమార్, టీజీవో అసోసియేటర్ ప్రెసిడెంట్ భానోతు దస్రు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు శ్రీ అమర్నేని రామారావు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధిపతి రవిబాబు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుడికందుల జ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ విజయలక్ష్మి, సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా ఖజానా ఉపసంచాలకులు వెంటపల్లి సత్యనారాయణ డిఎం సివిల్ సప్లై అధికారిని శ్రీలత జిల్లా DCEIS కనపర్తి వెంకటేశ్వర్లు మైనార్టీ డిపార్ట్మెంట్ ఆర్ సి ఓ అరుణ కుమారి కలెక్టరేట్ ఏవో కారుమంచి శ్రీనివాసరావు డిపిఆర్ఓ గౌస్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి టిజిఓ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జి ఉషాశ్రీ కార్యదర్శి పి సుధారాణి రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటపతి రాజు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు రాజేష్ తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్కు నాయక్ డ్రైవర్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరస్వామి పి ఆర్ టి ఓ జిల్లా అధ్యక్షులు కట్ట శేఖర్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి టి. వెంగళరావు తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుబ్బయ్య స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లయ్య ఆల్ పెన్షనర్ యూనియన్ జిల్లా బాధ్యులు యుగంధర్ పి ఆర్ టి యు పెన్షనర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మధుగారు వై.వి గారు జి జి ఎల్ ఏ జిల్లా అధ్యక్షురాలు ప్రమీల రాణి కార్యదర్శి నాగేశ్వరరావు,TIGLA రాష్ట్ర అధ్యక్షులు నయం పాషా జిల్లా బాధ్యతలు గణేష్ శంకర్ తెలంగాణ జూనియర్ లెక్చరర్ లెక్చరర్స్ అసోసియేషన్-711 మోదుగు వెంకటేశ్వర్లు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 జిల్లా కృష్ణార్జునరావ్
జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెల రవీంద్ర ప్రసాద్ డి ఎల్ పి ఓ రాంబాబు సూరంపల్లి రాంబాబు రమేష్ డాక్టర్ హరీష్ మంజుల శారద అరుణకుమారి బాలాజీ వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు తాజుద్దీన్ నాగేంద్ర కుమారి, వెక్కిరాల శ్రీనివాస్, నెల్లూరీ నాగేశ్వరరావు కంభం తిరుపతిరావు, విజయ, కోమలి, వెంకటరెడ్డి, అస్లాం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది విద్యార్థి సంఘ నాయకులు మీడియా మిత్రులు కుటుంబ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
