ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 14
17, 18 తేదీల్లో కవిత పర్యటన
జాగృతి జనంబాట పేరుతో ప్రజల వద్దకు…
తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నవీన్
జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 17, 18 తేదీల్లో ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన ఉంటుందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న రాత్రికి మధిరకు కవిత చేరుకుంటారని తెలిపారు. 17న మధిరలో జనంబాట ప్రారంభమై సత్తుపల్లి, వైరాలో ముగుస్తుందన్నారు. 18న ఖమ్మం, పాలేరులో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు. 18న ఖమ్మంలో మేధావులతో, తెలంగాణ ఉద్యమ కారులతో కవిత సమావేశమవుతారని తెలిపారు. అనంతరం కళాకారులతోనూ మమేకమవుతారన్నారు. అదే సందర్భగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో వివరిస్తారన్నారు. కవిత పర్యటనను విజయవంతం చేయాలని జిల్లాలోని తెలంగాణ విద్యావంతులు, ఉద్యమకారులు, మహిళలను కోరుతున్నామన్నారు. అనంతరం జనంబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ, ఐటి విభాగం కార్యదర్శి శశిధర్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ నాయక్, అనితా చౌదరి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మాధవి తదితరులు పాల్గొన్నారు.


