ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు..
ఖమ్మం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి రెండు కేసుల్లో గంజాయి నిందితులకు 20 , 10 సంవత్సరాల పాటు జైలు శిక్షలతోపాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తీర్పున గురువారం వెలువరించారు.
వివరాల్లోకి వెళితే..
గంజాయి నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష ..
ఖమ్మం పట్టణం వరంగల్ క్రాస్ రోడ్డులో రాజస్థాన్‌కు చెందిన నిందితుడు 22.150 కేజీల గంజాయిని 2024 జనవరి 9న తరలిస్తున్న క్రమంలో డీటీఫ్ సీఐ విజేందర్ టీమ్ పట్టుకున్నారు.
ఖమ్మం పట్టణ ఎక్సైజ్ స్టేషన్‌లో ఎస్సై సందీప్‌రావు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఎక్సైజ్ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, చంద్రమెహన్, సరితలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చార్జీషట్ వేశారు.
ఈ కేసులో ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
నిందితుడు రాజస్థాన్‌కు చెందిన బాగ్ చంద్ బైర్వా (31) అనే వ్యక్తికి ఈ శిక్ష విధించారు.
మరో కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష..
ఖమ్మం పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలో బైక్‌పై 7 కేజీల గంజాయిని సూర్యపేట్‌కు తరలిస్తున్న నలుగురిని 2022 ఏప్రిల్ 10న వేణుగోపాల్, సీఐ రాజు పట్టుకున్నారు. ఈ కేసులో కానుకుర్తి సాయి నవీన్, నేరేళ్ల శ్రీరాములు అనే ఇద్దరికి గురువారం ఖమ్మం ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి పది సంవత్సరాల జైలు శిక్ష రూ. లక్ష జరిమానా విధించారు.
ఈ కేసులో మారుశ్వర్‌రావు, బట్టు హరీష్‌లు నేటికి పరారీలో ఉన్నారు.
రెండు కేసుల్లో 20,10 సంవత్సరాల పాటు శిక్షలు పడడం పట్ల ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కేసు సంబంధించిన సిబ్బందిని అభినందించారు.

