
ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు
పొలిటికల్ పవర్ న్యూస్ 9 .ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు..
ఫిబ్రవరి 27, 28న మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలు
— పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 20శాతం పెంచాలి
— ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లను అమలు చేయాలి
— మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ
ఖమ్మం, ఫిబ్రవరి 25 : ఈనెల 27, 28న ఖమ్మం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే మాదిగ హక్కుల దండోరా మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగలు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆట-పాటలు, పోరాటాలు ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ పెంచాలి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి లిడ్ క్యాప్ భూములను సంరక్షించి లెదర్ పార్కులు అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను ప్రవేశపెట్టడమే కానీ అమలులో మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. హక్కుల సాధన కోసం ఈనెల 27, 28న జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు ఎస్సీ ఎస్టీలు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువసేన అధ్యక్షులు గొల్లపల్లి నరేష్ కుమార్ మాదిగ, వైరా నియోజకవర్గ ఇంచార్జి సగ్గుర్తి కోటేశ్వరావు మాదిగ, ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జి కనకపుడి వీరస్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
