భారత జాగృతి జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన దీక్ష …..
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు …భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే నిరసన తెలియజేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు #WomensReservationBill చేయాలనే డిమాండ్‌తో కల్వకుంట్ల కవిత గారు దీక్ష చేస్తున్నారు.
BharatJagruthiHungerStrike
KalvakuntlaKavitha
Post navigation
💐అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో… లాస్య క్లినిక్ గాంధీనగర్,ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వద్ద డా,,యం యస్ చిన్ని ఆధ్వర్యంలో 9 మార్చి 2023న సాయంత్రం 5గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షురాలు శ్రీమతి నున్నా క్రిష్ణ ప్రియ ముఖ్యఅతిథిలుగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ,ఉపమేయర్ శ్రీమతి షేక్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత,33వ, డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తోట ఉమా రాణి వీరభద్రరావు, ఖమ్మం నగర సర్కిల్ ఇన్సుపెక్టర్ శ్రీమతి అంజలి,నగర కార్పొరేటర్ శ్రీమతి పల్లా రోజ్ లీనా సాల్మన్ రాజు, శ్రీమతి రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ కార్పొరేటర్,శ్రీమతి గట్టు కరుణ,శ్రీమతి బానోత్ ప్రమీల,శ్రీమతి యం స్వరూప రాణి,శ్రీమతి పద్మ స్వచ్ఛoద మహిళా సేవకురాలు,డా,,సుగుణ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు,డా,,శశాంక చర్మ వ్యాధుల నిపుణురాలు,డా,, పెదమళ్ల స్రవంతి, డా,,కావ్య యాలముడి తదితరులు పాల్గొంటున్నారు కావున మీకు హృదయ పూర్వక ఆహ్వానం,ముందుగా ఎన్నికచేయబడిన మహిళలకు సన్మానము మరియు నూతన వస్త్రములు బహుకరణ… పలు విభాగాల్లో పని చేస్తున్నటువంటి వారిని సన్మానించడం జరుగుతుంది డాక్టర్స్ ని ఐసిడిఎస్ వారిని ఆశా వర్కర్లని ఆయాలని మున్సిపల్ సిబ్బందిని ఫోర్త్ స్టేట్ జర్నలిస్టులని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సన్మానించడం జరిగింది కన్వీనర్…ఖమ్మం..
ది. 08.03.2023 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …సమాజంలో అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలు : పోలీస్ కమిషనర్ ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తూ…అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు సమాజంలో గొప్ప స్ధానం వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసిన మహిళ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. అభివృద్ధి, నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి…ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళలకు 33% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్ని రంగాలలో మరింత రాణించాలని, నేటి పోటి ప్రపంచంలో పురుషులకు దీటుగా ప్రతికూల పరిస్థితులను అధికమించి అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా… మహిళలు రాణిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, మహిళలను తక్కువ చేసే దోరణి మారిందని అన్నారు. కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది. మహిళలకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పోక్సో, నిర్భయ చట్టాలను జిల్లాలో పకడ్భందిగా అమలవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ( AR) కుమారస్వామి, కృష్ణ ప్రసాద్ మెమరీ స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనన్, ఏసీపీలు గణేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రవి AO అక్తరూనీసా బేగం, సిఐలు అంజలి, సర్వయ్య, సురేష్, షీ టీమ్ ఎస్ ఉమా పాల్గొన్నారు.పి ఆర్ వో