ది. 08.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
సమాజంలో అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలు : పోలీస్ కమిషనర్
ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తూ…అనితరసాధ్యమైన
పాత్ర పోషిస్తున్న మహిళలకు
సమాజంలో గొప్ప స్ధానం వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసిన మహిళ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..
అభివృద్ధి, నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి…ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళలకు 33% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్ని రంగాలలో మరింత రాణించాలని, నేటి పోటి ప్రపంచంలో పురుషులకు దీటుగా ప్రతికూల పరిస్థితులను అధికమించి అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా…
మహిళలు రాణిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, మహిళలను తక్కువ చేసే దోరణి మారిందని అన్నారు.
కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది.
మహిళలకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పోక్సో, నిర్భయ చట్టాలను జిల్లాలో పకడ్భందిగా అమలవుతున్నాయని అన్నారు.
ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ( AR) కుమారస్వామి, కృష్ణ ప్రసాద్ మెమరీ స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనన్, ఏసీపీలు గణేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రవి AO అక్తరూనీసా బేగం, సిఐలు అంజలి, సర్వయ్య, సురేష్,
షీ టీమ్ ఎస్ ఉమా పాల్గొన్నారు.
పి ఆర్ వో

ByVNB News

Mar 10, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు