Post navigation ది. 18.03.2023పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి…వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగాఖమ్మంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గల భరోసా సెంటర్ ను ఈరోజు సందర్శించి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …హింసకు గురైన మహిళ ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్, వైద్యం సదుపాయం, న్యాయ సహాయం, పోలీస్ సహాయంతోభరోసాను కల్పిస్తున్నారని అన్నారు.2022 మార్చి 18న ప్రారంభమైన ఈ భరోసా సెంటర్లో ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ల ద్వారా లైంగిక వేధింపులు మరియు లైంగిక దాడులు గురైన బాధిత మహిళల 95 కేసులని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 95 కేసులలో కౌన్సిలింగ్ ని,161 స్టేట్మెంట్ రికార్డింగ్-92, మెడికల్ సర్వీస్-39, కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డింగ్-90, బాధ్యత మహిళల హోం విజిట్-60, అవగాహన కార్యక్రమాలు-47, ప్రభుత్వం ద్వారా బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం కాంపెన్సేషన్ అప్లై -59, విద్య మరియు వసతి సౌకర్యం కోసం బాధితులను బాలల సంక్షేమ సమితి-11, భరోసా నుండి బాధితులకు సహాయం అందించడం కోసం బాధిత మహిళల సహాయ నిధి ని 11 మందికి 55 వేల రూపాయలు సహాయం అందించటం జరిగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి( L&O) సుభాష్ చంద్రబోస్, టౌన్ ఏసిపి గణేష్, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ట్రాఫిక్ సిఐ అంజలి, భరోసా ఇంచార్జ్ ఎస్సై ఉమా, సంధ్యారాణి,భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి మరియు స్టాప్ పాల్గొన్నారువీఆర్వో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు పంపిణీముఖ్య అతిథి ఏసిపి పి.వి.గణేష్ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మదర్స -ఎ- ఇస్లామియా దారుల్ ఉలూమ్ లో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేద ముస్లింలకు ఉపవాసాలు ఉండే సమయంలో ఉపవాస దీక్షలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నెలకు సరిపడ సరుకులు , బియ్యం పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి నగర ఏసిపి పి.వి. గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యవసర సరుకులు పేద ముస్లింలకు అందజేసారు . సంస్థ నిర్వహకులు ఫ్రీ అంబులెన్స్ , ఫ్రీ నిత్యావసరాలు , చదువుకు , పెళ్లికి ఇలా సమాజంలో ఉన్న వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు . పండుగ అంటే అందరు జరుపుకొనేదని అందరి కోసం కొందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమాజానికి మంచి సందేశం ఇస్తుందన్నారు . సుమారుగా నిరుపేద ముస్లింలకు వంద మందికి అందజేశారు . ఈ కార్యక్రమంలో అభయ హస్పిటల్ సిఈఓ కరీం , మౌలానా సాదతుల్లాహ్ , ఎండి. మునవ్వర్ (సేఫ్ బాగ్స్ ) , హాఫిజ్ ఫజల్ , హాఫిజ్ నజీర్ , ముఫ్టీ మహబూబ్ అలీ , ముఫ్టీ సల్మాన్ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు .