ది. 18.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి…వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా
ఖమ్మంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గల భరోసా సెంటర్ ను ఈరోజు సందర్శించి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
హింసకు గురైన మహిళ ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్, వైద్యం సదుపాయం, న్యాయ సహాయం, పోలీస్ సహాయంతో
భరోసాను కల్పిస్తున్నారని అన్నారు.
2022 మార్చి 18న ప్రారంభమైన ఈ భరోసా సెంటర్లో ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ల ద్వారా లైంగిక వేధింపులు మరియు లైంగిక దాడులు గురైన బాధిత మహిళల 95 కేసులని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 95 కేసులలో కౌన్సిలింగ్ ని,161 స్టేట్మెంట్ రికార్డింగ్-92, మెడికల్ సర్వీస్-39, కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డింగ్-90, బాధ్యత మహిళల హోం విజిట్-60, అవగాహన కార్యక్రమాలు-47, ప్రభుత్వం ద్వారా బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం కాంపెన్సేషన్ అప్లై -59, విద్య మరియు వసతి సౌకర్యం కోసం బాధితులను బాలల సంక్షేమ సమితి-11, భరోసా నుండి బాధితులకు సహాయం అందించడం కోసం బాధిత మహిళల సహాయ నిధి ని 11 మందికి 55 వేల రూపాయలు సహాయం అందించటం జరిగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి( L&O) సుభాష్ చంద్రబోస్, టౌన్ ఏసిపి గణేష్, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ట్రాఫిక్ సిఐ అంజలి, భరోసా ఇంచార్జ్ ఎస్సై ఉమా, సంధ్యారాణి,భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి మరియు స్టాప్ పాల్గొన్నారు
వీఆర్వో

ByVNB News

Mar 18, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు