కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
బిఎస్ పి పార్టీ ఆదేశానుసారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు..
మన తెలంగాణ రాష్ట్ర బహుజన ఉద్యమ రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు Dr.R.S. ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడి, వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వాన్ని నిలదీస్తూ, Group 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితులలో తెలంగాణ నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తును కాపాడడం కోసం ఆమరణ దీక్షకు పూనుకొన్న మన నాయకుడు ప్రవీణ్ కుమార్ గారని మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ లు బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, Dr. M. వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిల్ల దయానందరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు Dr. సాంబశివ గౌడ్, అరుణ క్వీన్ లతోపాటు అనేకమంది రాష్ట్ర నాయకులను మరియు మహిళా నాయకురాళ్లను కూడా భారీ ఎత్తున పోలీసులు అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ స్థాయిలలోని నాయకులందరూ వెంటనే వీలైన చోటల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండకట్టి మన నాయకుల అరెస్టులకు నిరసన తెలుపాల్సిందిగా మన సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రాంజీ గౌతమ్ (M.P) గారు ఆదేశించడం జరిగింది.
వెంటనే రంగంలోకి దూకుదాం పదండి.
ఇట్లు
ప్రభాకర్ మంద
రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్
తెలంగాణ

ByVNB News

Mar 17, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు