




మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం నగరం 53వ డివిజన్ హలీమా ఖతుం మాజిద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి పువ్వాడ హాజరయ్యారు.
పవిత్ర రంజాన్ మాసంలో తోలి రోజు ఉపవాస దీక్షలు చేస్తున్న వారికి పండ్లు తినిపించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దీక్షను విరమింపజేశారు. అనంతరం భోజన విందును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రంలో మతాల మద్య ఘర్షణలు లేకుండా స్నేహా పూర్వకంగా కలిసి మెలిసి ఉండే సంస్కృతిని పెంపొందించారని అన్నారు.
రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని మజీద్ ల అధ్వర్యంలో దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నామని అన్నారు.
