మ‌త‌సామ‌రస్యాన్ని కాపాడ‌టంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం నగరం 53వ డివిజన్ హలీమా ఖతుం మాజిద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి పువ్వాడ హాజ‌ర‌య్యారు.

పవిత్ర రంజాన్ మాసంలో తోలి రోజు ఉపవాస దీక్షలు చేస్తున్న వారికి పండ్లు తినిపించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దీక్షను విరమింపజేశారు. అనంతరం భోజన విందును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ ప్ర‌భుత్వ హాయాంలో రాష్ట్రంలో మ‌తాల మ‌ద్య ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా స్నేహా పూర్వ‌కంగా క‌లిసి మెలిసి ఉండే సంస్కృతిని పెంపొందించారని అన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని మజీద్ ల అధ్వర్యంలో దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు