బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యానికి కార్య‌క‌ర్త‌లు స‌మిష్టిగా కృషి చేయాలి..

పొలిటికల్ పవర్ న్యూస్ 9. ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

▪️ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాలి.

▪️ప్ర‌జాప్ర‌తినిధులు, నాయకులు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి.

▪️నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సమన్వయంతో పని చేయాలి.

▪️మండలంకు CDP నుండి సింహభాగంలో అత్యధిక నిధులు ఇచ్చాం.. చేసిన అభివృద్ధిని చెప్పుకొక పోతే వెనకబడతాం..

▪️ఆత్మీయ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

రానున్న ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ హ్య‌ట్రిక్ విజ‌యం సాధించేలా ప్ర‌తి ఒక్క నాయ‌కుడు, కార్య‌కర్త కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు గణేష్ గార్డెన్స్ నందు ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల్లంలోని రఘునాధపాలెం, చింతగుర్తి, గణేశ్వరం, వేపకుంట్ల, చెరువుకొమ్ము తండా, వివి పాలెం గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీని మ‌రింత బ‌లోపేతం దిశ‌గా ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించుకుంటున్నామని పేర్కొన్నారు.

సీయం కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో 14 ఏళ్ళ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, కొట్లాడి సాధించ‌కున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీయం కేసీఆర్ దేశంలో ఎక్క‌డ లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. గ‌త తోమ్మిదేళ్ళుగా ప్ర‌జా సంక్షేమ ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ హ్య‌ట్రిక్ విజ‌యం సాధించేలా ప్ర‌తి ఒక్క నాయ‌కుడు, కార్య‌కర్త కృషి చేయాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివరించారు.

ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, నాయ‌కులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ప్రతి గడపకు అందుతుందని, అది మన ప్రభుత్వమే ఇస్తుంది అన్న విషయం వారికి తెలియచెప్పాలని పేర్కొన్నారు.

పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు గారు దిశానిర్ధేశం, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామన్నారు.

మండలం మొత్తం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, ఉచిత చేప పిల్లలు, సబ్సిడీ గొర్రెల పంపిణీ లాంటి తదితర స్కీములు ఎన్నో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.

ఇక దళిత వర్గాలు సగర్వంగా తలెత్తుకునేలా దళిత బంధు ఇచ్చామని, విద్య, వైద్య రంగాలకు రఘునాథపాలెం మండలం కేంద్రంగా ఉందన్నారు.

కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచితంగా విద్య‌ను అందిసస్తున్నామని, ఇప్పటికే మండలంలో అనేక పాఠశాలలు అభివృద్ధి చేశామని, కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు. కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందుతున్నాయని, జిల్లా కేంద్రంకు కూత వేటు దూరంలో ఉన్నామని, ఆధునిక వైద్యం అందిస్తున్నామని ఆయా సేవలు పొందిన వారిలో మన మండలం ముందుండి అని అన్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి తన CDP ఫండ్స్ అత్యధికంగా సింహ భాగం మండలంకే వెచ్చించామని ఒకప్పుడు బురద రోడ్లు గా ఉన్నవి మొత్తం GSB రోడ్లు, మెటల్ రోడ్లు, CC రోడ్లు L, BT రోడ్లు వేసుకున్నమని, మండలంలో ప్రతి గ్రామానికి ఇంటర్ కనెక్షన్ ఉండేలా రోడ్లు వేసుకున్నామని, ఇటీవలే అనేక డొంకలు కూడా రోడ్లుగా మార్చుకున్న విషయం గుర్తు చేశారు.

ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవడం మన వైఫల్యం క్రిందకు వస్తుందని అన్నారు.

రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే పార్టీ శ్రేణులు స‌మ‌యాత్తం కావాలని, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అంద‌రికీ తెలిసేలా ఇంటింటికీ వెళ్ళి వివ‌రించాలి. చేసిన అభివృద్ధిపై క‌ర‌ప‌త్రాల‌ను ముద్రించుకుని పంపిణీ చేస్తూ… విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాలన్నారు.

మండ‌ల‌, గ్రామ క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకోవాలి, క‌మిటీలు అంద‌రితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలన్నారు.

లేని పోని విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కొందరిని బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వారి కుట్ర‌ల‌ను, దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed