జులూరుపాడు

25 -03 -2023

🔶 మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం : నామ నాగేశ్వరరావు

🔶ఎన్నికలకు కార్యకర్తలంతా సంసిద్ధులై కదలాలి : నామ

🔶కార్యకర్తలే పార్టీకీ బలం, బలగం: నామ

🔶ప్రజా క్షేత్రంలో సత్తా చాటాలి : నామ

🔶సైనికుల్లా ఎన్నికల రంగంలో పోరాడాలి : ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్

🔶అలసత్వం వద్దు… పోరాటమే ముద్దు : రాములు నాయక్

🔶జులూరుపాడు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపు

🔶🔶మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని , ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదనిలోక్ సభ పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం జూలూరుపాడు మండలం వెంగన్న పాలెంలో జరిగిన
బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల , కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నామనాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు కార్యకర్తలంతా సంసిద్ధులై ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలనిపిలుపునిచ్చారు.
తమ మధ్య ఉన్న చిన్న చిన్న పొరపొచ్చాలను పక్కన బెట్టి సమైక్యంగా ముందుకు కదలి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతోగెలిపించుకోవాలనిఅన్నారు.ఈ మండలం నుంచి గతానికి మించిన మెజార్టీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తే పార్టీకి బలగం ,బలం అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పదవులు కార్యకరలు పెట్టిన బిక్షేనని అన్నారు. మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలే బీఆర్ఎస్ ను విజయపథంలో నడిపిస్తాయని తెలిపారు.తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదని పేర్కొన్నారు .
పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు,అభివృద్ధి గురించి మాట్లాడటం చాతకాని వాళ్ళు ఇక్కడ వచ్చి, ఏదేదో పనికి మాలిన మాటలు చెప్తున్నారని, అటువంటి వారి పట్ల అప్ర మత్తంగా ఉండి, తరిమి కొట్టాలని అన్నారు. అదానీ అంశంపై పోరాటం చేస్తున్నా పట్టించుకుండా , మాట్లాడ నీయకుండా ఎంపీ ల గొంతు నొక్కుతున్నారని అన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు నిర్ణయమని పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైనికుల్లా పార్టీ విజయానికి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పండుగ వాతావరణం లో ఆత్మీయ సమ్మేళనాలు జరువు కుంటున్నామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత అప్రమత్తతతో ఎన్నికలను తెలివిగా ఎదుర్కోవాలన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దన్నారు. అలసత్వం వీడి, పార్టీ బలోపేతానికిశ్రమించాలన్నారు.అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రూ.5లక్షల 500 ల విలువైన 10 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.
పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా టెలికం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ ఉప్పునూతలనాగేశ్వరరావు, ,ఎంపీపీ లావుడియా సోనీ లావుడియా సోనీ , జడ్పీటీసీ భూక్యా కళావతి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, గిరిబాబు వేల్పుల నరసింహారావు, చౌడం నరసింహారావు , పార్టీ మండల కార్యదర్శి నున్నా రంగారావు ,
రైతుబంధు మండల కన్వీనర్ ఎదళ్ళపల్లి వీరభద్రం , వైస్ ఎంపీపీ గాదె నిర్మల, సర్పంచులు గలిగే సావిత్రి ,
వెంకట లక్ష్మి లక్ష్మి ,రోజా ,
పద్మావతి,కైక ,పద్మ ,నర్సింహారావు, రాందాస్ నాయక్, కిషన్ లాల్, పెండ్యాల రాజశేఖర్ తదితరులు తో పాటు నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed