మధిరలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ..

▪️ట్యాంక్ బండ్, వెజ్ & నాన్ వెజ్ మార్కేట్ ప్రారంభం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

▪️భారీ వాహనాలతో మంత్రి పువ్వాడ కు ర్యాలీతో స్వాగతం పలికిన BRS శ్రేణులు..

మధిర నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటించారు.

మధిర పట్టణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి BRS శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ద్వారా స్వాగతం పలికి పట్టణంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

మధిర కేంద్రంలో రూ.5.70 కోట్లతో నూతనంగా అంబారుపేట ట్యాంక్ బండ్, చిన్న పిల్లల ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఓపెన్ జిమ్, స్టీల్ కాంపౌండ్ తదితర పనులను ప్రారంభించారు. అనంతరం టూరిజం శాఖ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన స్పీడ్ బోట్ ను ప్రారంభించారు.

పట్టణంలోని వర్తక సంఘం రోడ్ నందు రూ.4.50 కోట్ల తో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కేట్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

తెలంగాణ తల్లి సెంటర్ నూతనంగా నిర్మించనున్న నూతన మున్సిపల్ భవనం, అంబేద్కర్ భవనం (ఆడిటోరియం), డంపింగ్ యార్డ్, వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

పట్టణంలో రాయపట్టణం సెంటర్ చేపట్టనున్న ప్రధన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు, CC రోడ్స్, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతం, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మున్సిపల్ చైర్మన్ మొండితొక లత, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, TPO రమేష్, నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు