


: కార్మికులకు మంత్రి పువ్వాడ అజయ్ కానుక
: నాడు నేడు ఎప్పుడూ కార్మిక పక్షపాతి పువ్వాడ
: త్వరలోనే జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు
నాడైన నేడైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్మికుల పక్షపాతి వారి బాగోగులు సంక్షేమానికి వెన్నుదన్నుగా నిలిచి వెన్నంటే నిలిస్తున్న కుటుంబం పువ్వాడ. గతంలో కార్మిక వర్గ పెద్దదిక్కు పువ్వాడ నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్ వారి నేతృత్వంలో సాగిన కృషి ప్రయత్నం ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో నిర్విరామంగా కొనసాగుతున్నది.
ప్రస్తుతం జిల్లాలో కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులకు ఆత్మీయులుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరొందారు. వారికి వైద్య బీమా, జీవిత బీమా వంటి పథకాలు వర్తింపజేస్తూ, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలకు చొరవ చూపుతున్నారు మంత్రి పువ్వాడ.
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పుడూ చెప్తుంటారు. తాజాగా మంత్రి అజయ్ కార్మికులకు కానుకను అందజేశారు. ఆయన కృషి చొరవ ఫలితంగా ఖమ్మం జిల్లాలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగా త్వరలోనే ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు బ్రాంచ్ ఆఫీస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన 13వ రీజినల్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు.
సంఘటిత రంగం, చిన్న కర్మాగారాలు మరియు సంస్థలలో పనిచేసే కార్మికులకు ఆసుపత్రి త్వరగా ఏర్పాటు చేస్తే వైద్యపరంగా వారికి ఎంతో మేలు చేకూరుతుంది. జిల్లాలోని కార్మికులు అనారోగ్యం బారిన పడితే దూర ప్రాంతాల్లోని ఈఎస్‌ఐ దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. కార్మికుల కష్టాలను గమనించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈఎస్‌ఐ దవాఖానను మంజూరుకు కృషి చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ప్రాంతంలోని కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వారి వద్ద ఈఎస్‌ఐ కార్డులున్నప్పటికీ స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి. లేదంటే సుదూర ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి వెళ్లేవారు. ఖమ్మం జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభమైతే వేల మంది కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఇలా ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
