భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
VNB news staff reporter vempatti Naidu

సురక్షా దినోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సురక్షా దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రజలు,ప్రజాప్రతినిధులు,ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ కోరారు.సురక్షా దినోత్సవ వేడుకలలో భాగంగా రేపు ఉదయం జిల్లా పోలీస్ వాహనాలతో ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ వద్ద నుండి మొదలయ్యే ఈ ర్యాలీ పాల్వంచ దమ్మపేట సెంటర్➡️ జిల్లా కలెక్టర్ కార్యాలయం➡️ఇల్లందు క్రాస్ రోడ్➡️గణేష్ టెంపుల్➡️రైల్వేస్టేషన్➡️ఎస్పీ కార్యాలయం➡️సింగరేణి హెడ్ ఆఫీస్➡️రామవరం ఫారెస్ట్ చెక్పోస్ట్➡️పోస్ట్ ఆఫీస్ సెంటర్➡️చుంచుపల్లి పోలీస్ స్టేషన్➡️విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ నుండి U turn తీసుకుని ప్రకాశం స్టేడియం వద్ద ముగుస్తుందని తెలిపారు.పోలీసు వాహనాల ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియపరచడమే ఉద్దేశ్యంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్,హేమచంద్రపురం నందు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుల పనితీరును సూచించే విధంగా పోలీస్ శాఖలో వినియోగిస్తున్న సాంకేతికత విశిష్టతను తెలియపరిచే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సురక్షా దినోత్సవ వేడుకలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed