




నేడు పరిశ్రమలకు నిరంతర విద్యుత్ తో పాటు, స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం..
▪️రాష్ట్రంలో Faxconn స్థాపన వల్ల ఏకకాలంలో 1లక్ష ఉద్యోగాలు..
▪️దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా IT Hub లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలలో మాట్లాడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నేతృత్వంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొనసాగుతుందని, దేశంలోనే తెలంగాణ ప్రత్యేక స్థానం కైవసం చేసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం IT Hub లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత ఖమ్మం Vdo’s కాలనీలోని క్యాంపు కార్యాలయం నుండి IT Hub వరకు మంత్రి పువ్వాడ మోటార్ సైకిల్ పై ర్యాలీ నిర్వహించారు.
