
VNB news staff reporter vempatti Naidu
యాదాద్రి సహా 5 నిర్మాణాలకు ‘ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్’ అంతర్జాతీయ అవార్డులు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం.
తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఈ మేరకు లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను ప్రకటించింది.
లండన్‌లో ఈ నెల 16న గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డులను అందించనుందని, తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆయా అవార్డులను అందుకోనున్నారు.
యాదాద్రి ఆలయం సహా 5 భవనాలకు ‘ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్’ అవార్డులు దక్కిండం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.
అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం, మొజాంజాహీ మార్కెట్ ఉన్నాయని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం విశేషం అని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నాయకత్వంలో ఇలాంటి మరెన్నో అవార్డులతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.
