











తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కీ
ముఖ్యాతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
ఎస్.ఆర్.అండ్.బీ.జే.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ లో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. మున్సిపాలిటీ వాహనాలతో పెద్ద ఎత్తున సఫాయి కార్మికులు బతుకమ్మలతో కోలాట నృత్యలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మునిసిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన సఫాయి కార్మికులకు సలాం అంటూ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కితాజు ఇచ్చారు.. బుల్డోజర్ లెక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ గారు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం ఈ విధంగా అభివృద్ధి జరిగిందంటే మంత్రి కేటీఆర్ గారి అండ, సీఎం కేసీఆర్ గారి చొరవతో సాధ్యమైంది అని మంత్రి పువ్వాడ తెలిపారు. మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తిస్తూ సీఎం కేసీఆర్ గారు సఫాయి అన్నా సలాం అన్న, సఫాయి అమ్మ సలాం అమ్మ అనే నినాదాలు తీసుకొచ్చారని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న మున్సిపల్ కార్మికులకు, అధికారులకు, పాలకమండలికి, కమీషనర్, కలెక్టర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందనలు తెలిపారు. ఉత్తమ సేవలందించిన సఫాయి కార్మికులకు అధికారులకు శాలువాలు, మెమొంటోతో మంత్రి సత్కరించారు
