


జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మార్గం లేదు.. మంత్రి పువ్వాడ.
▪️అన్ని కులాలకు మతాలను గౌరవిస్తూ అభివృద్ది సంక్షేమం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
▪️అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూత.. తద్వారా రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతుంది.
▪️దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ.. బట్టలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం..
▪️రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం, గుడ్ షెఫరడ్ చర్చ్, మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు.
మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మరో మార్గం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఖమ్మం స్తంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి గార్లు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం రోటరీ నగర్ లోని గుడ్ షెఫరడ్ చర్చ్, తుమ్మలగడ్డలోని మజీద్- ఏ-అస్టాబల్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదని, ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బలం అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతున్నదన్నారు.
భిన్న మతాల భక్తి, ఆధ్యాత్మక రంగాల వైభవానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ, వేదహిత-వేద పాఠశాల సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ.2.00 లక్షలు ఆర్ధిక సహాయం అందించే పథకం ద్వారా అందిస్తున్నరన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు నెలకు రూ. 2,500 చొప్పున 1805 దేవాలయాలకు చెల్లించేవారని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1840 దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింపచేయడంతో మే 2023 నాటికి ఈ పథకం కింద లబ్ది పొందే దేవాలయాల సంఖ్య 3,645 కు చేరిందన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 75 లక్షలను మంజూరు చేసిందని, అపర కర్మ భవనం, మధిర పట్టణంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 73 లక్షలు మంజూరు చేసిందని వివరించారు.
దేశమే అబ్బుర పడే యాదాద్రి దేవాలయంను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్థపతులు, ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా రాతి దేవాలయ నిర్మాణాన్ని చేశారని, వైష్ణవ సాంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, పల్లవ, హోయసాల, చాళుక్య శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుందన్నారు.
▪️అధికారికంగా రంజాన్ వేడుకలు.. తోఫాలు..
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రంజాన్ పండుగ నిర్వహణ
గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, సామాజిక స్వరూపాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మొహర్రమ్, పీర్ల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిందన్నారు.
అనేక దర్గాలకు హిందువులు సైతం వెళ్తారని, దేశంలో మైనారిటీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సాంప్రదాయాలను, విశ్వాసాలను గౌరవిస్తూ రంజాన్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.
అదే విధంగా 2015 నుండి ప్రతీ ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో దావత్-ఇ-ఇప్తార్ కార్యక్రమాన్ని, 2017 నుండి పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నదన్నారు.
షాదీ ముబారక్ పథకం
రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం మైనార్టీ ఆడ పిల్లల వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించే సదుద్దేశంతో 2014 అక్టోబర్ 2 నుండి షాదీ ముబారక్ అనే ప్రయోజనాత్మకమైన పథకాన్ని ప్రారంభించి ఈ పథకం కింద షాదీ సమయంలో వధువుకు రూ. 1,00,116 లను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తున్నదని, గడిచిన 9 ఏళ్ళలో 2,55,518 మంది పెళ్లిళ్లకు 2,130.95 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు.
ముస్లిం అనాథల కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 39 కోట్లతో అనీస్ ఉల్ ఘుర్ నిర్మిస్తున్నారని, ఆయా పనులు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
ముస్లింల ప్రార్థనా స్థలాలు అయిన మసీదులు, మదర్సాల్లో ఉండే ఇమామ్, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,000 ల గౌరవ వేతనాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 10 వేల మందికి ఈ గౌరవ వేతనాన్ని అందిస్తూ సమాజంలో వారికి గౌరవప్రదమైన హోదాను, గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు.
హజ్ యాత్రికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు
హజ్ యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు, యోగక్షేమాలను చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని, మక్కా, మదీనాలకు హజ్ యాత్రను నిర్వహించే నిమిత్తం రాష్ట్ర హజ్ కమిటీకి ప్రభుత్వం రూ.3 కోట్ల గ్రాంటును ఇచ్చిందన్నారు.
▪️అధికారికంగా క్రిస్మస్ పండుగ..
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రతీ ఏటా రాష్ట్ర వ్యాప్తం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని, క్రిస్మస్ విందులు ఎర్పాటు చేస్తున్నదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని చర్చిలలో ఒక్కో చర్చికి రూ. 2 లక్షల చొప్పున కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏడాది పేద క్రైస్తవులకు కొత్త బట్టలను పంపిణీ చేస్తు 2022 క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.85 లక్షల మందికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన
కోకాపేట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నదని, దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరస్తున్నదన్నారు.
చర్చిల నిర్మాణాలకు అనుమతులు సులభతరం, పునరుద్ధరణకు చర్యలు
చర్చిల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసి, తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవని కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వెసులుబాటు కల్పించిందన్నారు.
ఇలా అనేక కార్యక్రమాలతో పాటు సందర్భానుసారం ప్రభుత్వం పలు ఉత్సవాలు, కార్యక్రమాలకు నిధులను విడుదల చేస్తూ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వేల్లివిరిసేలా చర్యలు చేపడుతున్నదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్ కుమార్, దండా జ్యోతి రెడ్డి, దాదే అమృతమ్మ సతీష్, మడురి ప్రసాద్, మక్బూల్, ఆలయ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు(చిన్నా), పాస్టర్ లు Rev.జాన్ కాంతారావు, Rev.B సత్యపాల్, జోజి, జిల్లా మైనార్టీ అధికారి మెహమూద్, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, షౌకత్ అలీ, మెహబూబ్ అలీ, ముఫ్తీ ఖలీక్, తాజ్ఉద్దీన్ ఎండీ గాయాజ్, షంశుద్దిన్, టిప్పు సుల్తాన్ తదితరులు ఉన్నారు.
