VNB TV staff reporter vempatti Naidu kmm
ఖమ్మం, జూలై 4: ప్రభుత్వ జీవోలు 58, 59 అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లాలోని తహశీల్దార్లతో జీవోలు 58, 59 అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవో 58 క్రింద 1952 దరఖాస్తుల విచారణ చేపట్టి, 1361 దరఖాస్తుల ఆమోదం తెలిపినట్లు, 544 దరఖాస్తులను తిరస్కరించి, 21 దరఖాస్తులను జీవో 59 కు మార్పు చేసినట్లు తెలిపారు. 15094 దరఖాస్తుల విచారణ చేయాల్సివున్నదని, విచారణ వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో జీవో 59 క్రింద 1947 దరఖాస్తులు రాగా, 64 దరఖాస్తుల విచారణ పూర్తి చేసి, 41 దరఖాస్తుల ఆమోదం తెలిపినట్లు, 23 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, ఇంకనూ 1883 దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ప్రత్యేక అధికారులు, దరఖాస్తుల పరిశీలన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రోజువారి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలన్నారు. జీవో 59 ద్వారా దరఖాస్తులకు జారీచేసిన డిమాండ్ వసూళ్లకు దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలని, త్వరితగతిన చెల్లించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
