



ఎంపీ వద్దిరాజు కాంగ్రెస్ నాయకులు రాహూల్ గాంధీకి కౌంటర్
Date 03/07/2023
ఎంపీ రవిచంద్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి,అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య,రెడ్యానాయక్,సురేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ లతో కలిసి బీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రెడ్యానాయక్, జాజుల సురేందర్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ లతో అసెంబ్లీ ప్రాంగణంలోని బీఆర్ఎస్ఎల్పీలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కామెంట్స్
👉ఖమ్మంలో నిన్న కాంగ్రెసు పార్టీలో చేరిన వారంతా ప్రజల తిరస్కారానికి గురైన వాళ్లే
👉 తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్
👉 టీఆర్ఎస్ లెక్కనేనన్ని పెద్ద పెద్ద సభలు నిర్వహించింది
👉2018లో 88సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది
👉2023నవంబర్ లో 100సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయం
👉 హరీష్ రావు గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ వాళ్లకు అతీలేదు గతీ లేదని స్పష్టం చేశారు
👉ప్రజల దృష్టిలో ఉంది,సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా గట్టిగా కాంగ్రెసుకు బుద్ధి చెబుతారు
👉 కేసీఆర్ కు ప్రజల కష్టాలు,అవసరం గురించి బాగా తెలుసు
👉 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలేమిటో తెలంగాణ ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలి
👉 తెలంగాణలో మాదిరిగా రైతులకు 24గంటలు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబంధు,ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదో స్పష్టం చేయాలి
👉ప్రజలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారు, చేస్తున్నారు,ప్రజలు తిరిగి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారు
👉 కేసీఆర్ టీం,దీ బెస్ట్,ప్రజల టీం,ఏ పార్టీకి కూడా బీ టీం కాదు
👉 కేసీఆర్ ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారు
👉వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి పెడతారు, ప్రముఖ పాత్ర పోషిస్తారు
