







VNB TV NEWS BCM staff reporter vempatti Naidu
జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో హైదరాబాద్ కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్నందున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, అనుభూతులతో వెళ్తున్నట్లు చెప్పారు.
ఈ జిల్లా ఇచ్చిన మధురానుభూతులు మరువలేనివని చెప్పారు. 2019లో శిక్షణా కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చారని, చాలా దూరం వచ్చారని అనుకున్నానని చెప్పారు. నాలుగు సంవత్సరాల్లో ఎన్నో నేర్చుకున్నానని, రజత్ కుమార్ సైని, ఎంవి రెడ్డి ల దగ్గర పని చేయడం నాకు చాలా ఉపయోగపడినట్లు చెప్పారు. క్లిష్టమైన సమస్యలు వచ్జినపుడు జే.సి సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయని చెప్పారు. పోడు సమస్య పరిష్కారానికి పిఓ, డిఎఫ్ ఓ సహకారం మరువలేనిదని చెప్పారు. ఎస్పిలు వినీత్, సునీల్ దత్ సహకారం కూడా మరువలేనిదని చెప్పారు. విధుల నిర్వహణలో సిబ్బంది అద్భుతంగా పని చేశారని చెప్పారు. ఎన్నో సంవత్సరాలు సమస్యలు పరిష్కరించబడినట్లు చెప్పారు. సైనికుల్లా చాలా అద్భుతంగా పని చేసారని చెప్పారు. వాళ్ళ పని కాకపోయినా బాధ్యతగా పని చేశారన్నారు. గ్రామ స్థాయు నుండి జిల్లా స్థాయి వరకు సమన్వయం తో పని చేసారని చెప్పారు. గోదావరి వరదల్లో బాగా చేసారని చెప్పారు. మారు మూల జిల్లాకు అవార్డులు తెచ్చిపెట్టారని చెప్పారు. మున్సిపల్లో అబ్దుతమైన పనులు చేసి పట్టనాన్ని హారిత శోభతో నింపారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పరిశ్రమ ల సహకారం అందించి మంచి మంచి పనులు చేసినట్లు చెప్పారు. మీడియా సహకారం చేసిన మంచి పనులు గుర్తించి ప్రజలకు సమాచారం అందించారని అభినందించారు. మౌళిక సదుపాయాలు గణనీయంగా పెంచారని చెప్పారు. సమర్థవంతంగా పని చేయుటలో మీ అందరి సహకారం మరువలేనిది చెప్పారు. మా సతీమణి నా దిక్సూచి లా భార్య కంటే ఎక్కువగా స్నేహితురాలిగా సహకారం అందించారని చెప్పారు. నా కొడుకు మన్యం బిడ్డేనని చెప్పారు
తల్లితండ్రులు నేర్పిన సిద్ధాంతాలు అవే గైడ్ ఉపయోగపడుతున్నాయని చెప్పారు. భద్రాద్రి రాముడు కి ఎప్పటికి రుణ పడి ఉంటానని చెప్పారు. పరిపాలనలో ఓనమాలు నేర్పిన ఈ ప్రాంతానికి ఎల్లపుడు రుణ పడి ఉంటామని చెప్పారు.
