దేశ సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం

యూసీసీ , ద్రవ్యోల్బణం, విభజన సమస్యలపై రాజీలేని పోరు

గవర్నర్ల వ్యవస్థపై చర్చకు పట్టు

సమావేశాల గడువు పొడిగించాలి

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు

ఖమ్మం, జూలై 19 : దేశంలో జరుగుతున్న అనేక సమస్యలపై రేపటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చర్చకు పట్టు బడుతుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు సమస్యలపై చర్చ చేపట్టాలని కూడా బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశం లో కేంద్రాన్ని కోరామని చెప్పారు.యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ ,మణిపూర్ అంశంపైనా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలని.. ఆ అంశంపై చర్చ చేపట్టాలని కోరామన్నారు. అలాగే గవర్నర్ల అంశంపై కూడా చర్చ చేపట్టాలని కోరామన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇందుకు అనేక ఉదాహరణలున్నాయని,ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాల్సిందేనని అఖిలపక్షం సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నామని చెప్పారు.
తమిళనాడులో ఒక మంత్రిని గవర్నర్ తొలగించిన తీరును అఖిల పక్ష సమావేశంలో మాట్లాడామన్నారు.ఈ అంశంలో చర్చ జరగాలని చెప్పామన్నారు.
రైతు సమస్యలపై పోరాటం జరిగినప్పుడు కేంద్రం పలు హామీలు ఇచ్చింది.. ముఖ్యంగా రైతులకు మద్దతు ధర సహా ఇతర అంశాలపై చర్చ జరగాలని కూడా కోరామని,
నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న నిత్యవసర ధరలు, పెండింగ్ లో ఉన్న విమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టాలని కోరామని, ఈ అంశాలపై బీఆర్ఎస్ పార్లమెంట్ సాక్షిగా పోరాడుతుందన్నారు.నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ధరలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, జాతీయ జనగణన అంశాలపై కూడా చర్చ చేపట్టాలని కోరామని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి రిపేర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన అంశాలపైనా కూడా పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు.
తెలంగాణ పెండింగ్ అంశాలతోపాటు పెండింగ్ బకాయిలపై కూడా చర్చకు అవకాశం ఇవ్వాలని అఖిల పక్ష సమావేశం లో కోరామని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యల సాధనకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సమావేశాల్లో లెవనెత్తుతామన్నారు.తెలంగాణా అభివృద్ధిలో అన్ని అంశాల్లో నెంబర్ వన్ గా ఉందన్నారు. పవర్, ధాన్యం ఉత్పత్తి లోను, తలసరి ఆదాయంలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉన్న విషయాన్ని పార్లమెంట్ లో వెలుగెత్తి చాటుతామని చెప్పారు. రైలు ప్రమాదాలపై చర్చ జరుపుతా మన్నారు. .కేవలం బిల్లుల ఆమోదానికి సమావేశాల సమయం తక్కువుగా ఇచ్చారని, సమావేశాల గడువు పొడిగించాలని నామ కోరారు తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించామని, దేశానికి అనేక అంశాల్లో తెలంగాణా రోల్ మోడల్ గా నిలుస్తుందని నామ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు