



వైరా మున్సిపాలిటీలో పలువురిని పరామర్శించిన బాణోత్ మదన్ లాల్
వైరా మున్సిపాలిటీలో సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఐదో వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న వజినేపల్లి చక్రవర్తి భార్య వజినేపల్లి శశికళను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గాంధీ చౌక్ లో రంగా సత్యనారాయణ భార్య రంగా వాసవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి విషయం తెలుసుకున్న మదన్ లాల్ అక్కడికెళ్లి రంగా వాసవి ని పరామర్శించారు .అనంతరం ప్రముఖ వ్యాపారవేత భూమాత కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మద్దేల రవి, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణర్జునరావు, వర్తక సంఘం అధ్యక్షులు కౌన్సిలర్ వనమా విశ్వేశ్వర రావు, ఐదో వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్, డాక్టర్ కాపా మురళీకృష్ణ ,హనుమకొండ రమేష్, దొంతేబోయన గోపి ,మిట్టపల్లి సత్యంబాబు ,నూకల వాసు ,మరికంటి శివ ,ఏదినూరి శ్రీనివాసరావు, కొణతాలపల్లి సుబ్బారావు, బొగ్గులు శ్రీనివాస్ రెడ్డి, మూలా దుర్గాప్రసాద్, ఆదూరి ప్రేమ్ కుమార్ ,వేల్పుల నారాయణ, మణిదీప్ ,తోటకూర వీరబాబు,ఏలురి నరసింహారావు ,అనుమొలు సైదులు ,చెర్రీ, శివ,వజినేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు
