భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రూ.15.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు గాను భద్రాచలం అంబేడ్కర్ సెంటర్ నందు ఆయా పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.

▪️1). భద్రాచలం పట్టణంలో రూ.2.60 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్ మరియు సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

2). పట్టణంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సమగ్ర కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

3). పట్టణంలో రూ .1.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారులు & సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

4). భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ వద్ద రూ.38 కోట్లతో నిర్మించనున్న మిగులు కరకట్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

6). పట్టణంలో ఏరియా హాస్పిటల్ నందు రూ.21.50 లక్షలతో నిర్మించిన కిచెన్ కాంప్లెక్స్, సీసీ రోడ్స్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు