తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ@డిస్టిక్ బ్యూరో వెంపటి నాయుడు
ఇక్కడ అభ్యర్థి తుమ్మల నరం లేని నాలుక లా మాట్లాడుతున్నాడు..
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నాపై పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని నరం లేని నాలుక లాగే మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
ఖమ్మం నగర ప్రముఖ వైద్యులు Dr. గంగరాజు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్..
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తను ఒక్కడే బాగు పడాలి అనే మనస్థత్వం కలవాడని, నేను చేసిన అభివృద్ది కూడా అతనే చేసినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తుమ్మల ఇంతకాలం రాజకీయంలో ఉండి ఖమ్మం నగరానికి ఏమైనా అభివృద్ధి చేశారా..
5 సంవత్సరాల క్రితం ఖమ్మంలో ఇంత అభివృద్ధి ఎప్పుడైన జరిగిందా.
అభివృద్ధి జరగడం కారణంగా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వచ్చాయి.
తద్వారా ప్రైవేట్ రంగంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
నూతన కలెక్టరేట్ భవనం(SRR Constuctions), ఐటి హబ్ (Ambience Constructions), ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (KVR Private Limited), ధంసలాపురం ROB (G Infra, GVR), నూతన బస్ స్టాండ్(Chabriya Constructions కంపెనీ), లకారం ట్యాంక్ బండ్ (MSR Constructions), మున్సిపాలిటీ రోడ్స్(మున్సిపల్ కాంట్రాక్టర్స్), తల్లి పిల్లల హాస్పిటల్ (Ambience Constructions), గొల్లపాడు ఛానల్ (Ramky & Co),
శ్రీశ్రీ సర్కిల్ టు వీవీ పాలెం రోడ్ (MSR Constructions), ఇల్లందు రోడ్ (G Infra GVR) సంస్థ పనులు చేపట్టారు.
ఆయా పనులు దక్కించుకుననే వారు టెండర్ వేసుకుని పనులు చేసుకుంటారు. ఆ మాత్రం కూడా తెలియని వారికి రాజకీయాలు అవసరమా..
కనీస అవగాహన లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడటం సిగ్గు చేటు. నాపై బురద జల్లాలి అని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు ఆలోచన చేయాలి. అసంబంధమైన ఆరోపణలను ప్రజలు తిప్పి కొట్టాలి.
వచ్చే ఎన్నికల్లో BRS ప్రభుత్వం కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా..
సమావేశంలో Dr. భాగం కిషన్ రావు, Dr.చైతన్య, Dr.సీతారాం, Dr.నవీన్, Dr.అనూష, Dr.ఆలురి వంశీ, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు.

