ఖమ్మం : కొన్ని మాధ్యమాలల్లో డాక్టర్స్ గురించి అబద్ధాలు , అసత్యాలు వాస్తవ విరుద్ధ మైనటువంటు ఆరోపణలతో కొన్ని రకాల పోస్ట్లు వస్తున్నాయి . గత 5/10 సంవత్సరాలనుంచీ డాక్టర్ల పైన దాడులు జరిగిన సంఘటనలను మనం చూడలేదు . వారి వృత్తిని ప్రశాంతమైన వాతావరణం లో నిర్వహించుకుంటూ ఉన్నారు . ఖమ్మం లోని అన్ని ప్రాంతాలలోను హాస్పిటల్స్ నిర్వహణ కార్యక్రమాలు ఆయా డాక్టర్లు సంతోషంగా నిర్వహించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే . ఈ 5 సంవత్సరాలలో అనేక కొత్త హాస్పిటల్స్ వచ్చాయి. ఎందరో డాక్టర్ లుగా తీర్చిదిద్ది బడ్డారు . ఇతర ప్రాంతాల వారు ఇక్కడకి వచ్చి ఇక్కడి వారు బయటకు వెళ్లి మంచి వాతావరణం లో పనిచేసుకుంటూ ఉన్నది జగమెరిగిన సత్యం . వందల మంది విద్యార్థులను డాక్టర్లు గా తీర్చిదిద్దిన ఘనత మమతా హాస్పిటల్స్ ది . దేశ విదేశాల్లో స్థిరపడిన ఎందరో డాక్టర్ లు అందుకు సాక్ష్యం . రాష్ట్రం లోని ఉన్నతమైన హాస్పిటల్ గా వెలుగొందుతున్న మమతా పైన అక్కసు వెళ్లగక్కడం శోచనీయం . బాధాకరం . ప్రభుత్వ ఉన్నత అధికారులను కానీ సామాన్య ఉద్యోగులను కానీ ఇంతవరకు వేదింపులకు గురి చేసిన సంఘటనలు లేవు . ఏ ఒక్క ప్రదేశం లోనూ ఆక్రమణలు, కబ్జాలు, భూ దందాలు జరిగినట్లుగా గతంలో ఎప్పుడూ మనం వినలేదు . ఇప్పటి వరకూ మనం బెదిరింపులకు దిగినట్లు సమాచారం ఎక్కడా లేదు . ఈ ఎలక్షన్ వచ్చినప్పుడే అలాంటివి పుట్టిస్తున్నారు . మనమూ , మన ima డాక్టర్లు అందరం నమ్ముకున్న వృత్తిని నిర్వహిస్తూ ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూస్తూ మన పనిలో ఉన్నాము . దురదృష్ట వశాత్తు మమ్మల్ని రాజకీయానికి వాడుకోవాలని చూస్తునట్లు మా ద్రుష్టి కి కొంతమంది మిత్రులు తీసుకుని వచ్చారు . IMA అసోసియేషన్ సభ్యులు అన్ని పార్టీలల్లో ఉన్నారు దయచేసి రాజ్జకీయాలల్లోకి లాగకండి . ఎలక్షన్లు వస్తూ పోతూ ఉంటాయి. రాజకీయాల కోసం పవిత్రమైన వృత్తిని మనమే అవహేళనలు చేసుకోకూడదు అని విన్నపం అన్నారు . ఈ కార్యక్రమంలో Dr నారాయణ రావు ( ప్రెసిడెంట్ ) , Dr జగదీశ్ ( సెక్రటరీ ) , Dr కిషన్
( ఫస్ట్ ప్రెసిడెంట్ ) , Dr తన్మాయ్ , Dr జగదీష్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు