డిసిసిబి సీఈవో శ్రీ అట్లూరి వీరబాబు పదవీ విరమణ:-
ఆర్బిఐ ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ప్రకారం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు ది.19.10.2020 నాడు బ్యాంక్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అట్లూరి వీరబాబు గారు ఈరోజుతో మూడు సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో పదవీ విరమణ కార్యక్రమాన్ని బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఖమ్మం నందు బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షుల వారు మాట్లాడుతూ వీరబాబు గారు బ్యాంక్ సీఈవో బాధ్యతలు స్వీకరించిన నాడు బ్యాంకు సుమారు 7.50 కోట్ల నష్టములలో ఉన్నదని అటువంటి స్థితి నుండి ఈరోజు బ్యాంక్ 22 కోట్ల లాభములో అర్జించే స్థాయికి వచ్చిందని మరియు ఎన్ పి ఏ లను గణనీయంగా తగ్గించాము అని సుమారు 90 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు, 50 మందికి బ్యాంకులో ఉద్యోగాలను కల్పించాము. సుమారు 70 సంఘములకు 30 కోట్లతో గోదాములను మరియు ఆఫీస్ బిల్డింగులను నిర్మించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూనవరం, కుక్కునూరు బ్రాంచ్ లను తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాలకు తరలించామని బ్యాంక్ పాలకవర్గ సహాకారముతో సీఈవోగా వీరబాబు గారు జిల్లా యావత్ రైతాంగానికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి దంపతులు మరియు పాలకవర్గ సభ్యులు సీఈఓ వీరబాబు గారి దంపతులను ఘనంగా సత్కరించారు.వారి భావి జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
బ్యాంక్ సీఈఓ వీరబాబు గారు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సర కాల పరిమితిలో బ్యాంకును మంచి స్థానంలో ఉంచుటకు శక్తి వంచన లేకుండా పనిచేశానని అభివృద్ధి దిశకు ప్రయాణం చేయుటకు నా వంతు కృషి చేశానని, బ్యాంక్ అధ్యక్షులు మరియు పాలకవర్గ…
