నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనం..

▪️ఖమ్మంలో పువ్వాడ విజయాన్ని కాంక్షిస్తూ హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామ నాగేశ్వరరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన.

▪️బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన ప్రజలు.

ఖమ్మంలో పువ్వాడను గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తే ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.

పువ్వాడ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరం 37, 38, 39, 40, 41, 27వ డివిజన్ల పరిధిలోని ఖిల్లా, కమాన్ బజార్, కాస్బా బజార్, బీకే బజార్, రాతి దర్వాజ, నిజాం పేట, శుక్రవారిపేట, బినకల్ రోడ్, st Mary స్కూల్ ముస్తఫా నగర్ వరకు భారీ ర్యాలీ.. రోడ్ షో చేపట్టారు.

ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. బైక్ ర్యాలీ హైలెట్ గా నిలిచింది. యువకులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని, బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు.

ఈ సందర్భంగా పలు కూడళ్లలో వక్తలు మాట్లాడుతూ..

జిల్లాలో అన్ని స్థానాలు BRS పార్టీ గెలుచుకుంటుందని అని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్ళలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి అద్భుతంగా పని చేసిందన్నారు.

ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ఖమ్మంలో పువ్వాడ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఖిల్లా ఏరియా తో పాటు కమాన్ బజార్, కస్బా బజార్, వైరా రోడ్డు, బీకే బజార్, ముస్తఫా నగర్ తదితర ప్రాంతాల్లో

జిల్లాలో 10 కి 10 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుని తీరుతుందని స్పష్టం చేశారు.

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అన్నారు.

ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉందని, ఖమ్మం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పువ్వాడ అజయ్ కుమార్ కు వెన్నుదన్నుగా నిలిచి, అత్యధిక మెజార్టీతో గెలిపిoచి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు.

ఖమ్మాన్ని మరింతగా అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అన్నారు.

ప్రదర్శన జరుగుతున్నంత సేపు ప్రజలు, వ్యాపారులు ఆరు బయటకు వచ్చి, చిరు దరహాసంతో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించరు.

కార్యక్రమంలో ముస్లిం నేతలు, మైనార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్పొరేటర్ లు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed