






Khammam/18.11.2023
మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ
పువ్వాడ అజయ్ గెలుపు కాంక్షిస్తూ.. వదిన జయశ్రీ ఇంటింటి ప్రచారం.
ఖమ్మం నగరం 9వ దివిజన్ రోటరీ నగర్ లో పువ్వాడ అజయ్ కుమార్ గారి విజయంను కాంక్షిస్తూ అజయ్ కుమార్ గారి వదిన పువ్వాడ జయశ్రీ గారు, వారి కోడలు సాయి శిరిణి గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఒకప్పుడు ఎలా ఉండేది ఖమ్మం.. నేడు ఎలా ఉంది ఖమ్మం ప్రజలు గమనించి అభివృద్దిని కొనసాగిస్తున్న అజయ్ గారిని గెలిపించాలని కోరారు.
ఖమ్మంలో ప్రతి డివిజన్ లో ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందించారని, కోట్ల రూపాయల నిధులు ఖమ్మంకు తీసుకొచ్చి నగర స్వరూపాన్ని మర్చేశారని మీ సహకారం తో మరింత అభివృధ్ది చేయాలంటే కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు.
కార్యక్రమంలో నగర మహిళా అద్యక్షురాలు తన్నీరు శోభా రాణి, నాయకురాలు గుండపనేని జయ, బానోతు ప్రమీల, బండ్ల రుక్మిణీ, జయారెడ్డి, పొదిల నాగరాజు, బండ్ల నరసింహారావు, మందడపు కృష్ణారావు, గోగుల వీరయ్య, రమణ, లక్ష్మణ్, కృష్ణ, పరిటాల రవి, అమనబోయిన ఉదయ్, మాచర్ల పృధ్వి, విజయ్, విశాల్, మాధవ్, ఫహీమ్, నవీన్ తదితరులు ఉన్నారు.
