Khammam/25.11.2023

మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

GV మాల్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం.

వస్త్ర రంగలో ప్రముఖు మాల్ GV మాల్ అధినేత గుర్రం ఉమా మహేశ్వర రావు అధ్వర్యంలో మామిళ్ళగుడెంలోని వారి నివాసంలో GV మాల్ ఉద్యోగులు, సిబ్బందితో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం BRS అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.

జీవి మాల్ అధ్వర్యంలో నాకు మద్దతు పలికినందుకు యాజమాన్యానికి నా ధన్యవాదాలు.

GV మాల్ అనే బ్రాండ్ మళ్లీ 5 ఇయర్స్ లో నేను ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసరికి 50 స్టోర్స్ చేస్తాడు ఉమామహేశ్వర రావు గారు.

ఆయన కుటుంబ సభ్యులు.. ఆయనకు అంత ఎనర్జీ ఉంది.

2500 మంది సిబ్బందికి వేతనాలు ఇస్తున్న అతిపెద్ద సంస్థ జీవీ మాల్.. GV మాల్ అంటే సాధారణ విషయం కాదు.

నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా భావించి నాకొసమని చెప్పి ఓటు అడగటం కోసం నేను ఇక్కడ వచ్చాను..

నాకు మంత్రి పదవి వస్తే ఎక్కడెక్కడ ఏం చేయాలి.. ఏం మార్చాలి అని అనుకున్నా.. ఎక్కడ రోడ్డు విస్తరణ చేయాలి. ఏక్కడ ఏమీ తీసుకురావాలి అనే ఆలోచనతోనే పని చేశా.

హైదరాబాద్లో ఏముoది.. మనం ఖమ్మానికి ఏమి తుసుకురావాలి అని అపుడే నేను ప్లాన్ వేసుకున్నాను. స్కీమ్ వేసుకున్న..

6 & 7 నెలలోనే అపుడే నేను సీఎం గారికీ చెప్పుకున్న.. సార్ మీరు గతంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు. ఒకరోజు మొత్తం పాదయాత్ర చేశారు..
ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్, ఆర్టీసీ నూతన బస్టాండ్, ఐటీ హబ్, కొత్త మున్సిపల్ కార్యాలయం ఆలోచనలు ఉన్నాయని చెప్పగా సానుకూలంగా స్పందించారు.

నేను ఇక్కడ మంత్రి గా ఉన్న కాబట్టి అనుకున్న దానికంటే పది రేట్ల నిధులు అధికంగా తీసుకురాగలిగినం.

ఈ సారి మళ్ళీ వచ్చేది కేసీఅర్ గారే.. BRS ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ అజయ్ అన్న కూడా గెలుస్తే 3వేలు కాదు.. 30వేల కోట్ల నిధులు తీసుకు వస్తా..

వచ్చే ఎన్నికల్లో అజయ్ అన్న ను కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed