



క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ.
ఖమ్మం : రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో దైవజనులు మంద సంజీవరావు ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుక ఘనంగా జరుపుకోవడం జరిగినది . ఏసుక్రీస్తు మన కొరకే పుట్టాడని మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని అన్నారు . సర్వలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన పాపల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి తిరిగి మూడో రోజు లేచాడని మరలా తిరిగి వస్తానని చెప్పి మనల్ని పరిశుద్ధులుగా చేసి మన కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పిన మాట రోజు వాక్యముగా దైవజనులు తెలియ చేయడం జరిగినది . ఏసుక్రీస్తు పుట్టుక సందర్భంగా వృద్ధులకు , వితంతువులకు , నూతన వస్త్రములు పంపిణీ చేయడం జరిగినది . అదేవిధంగా క్రీస్తు కృప ప్రార్థన మందిరం వారి 2024వ క్యాలెండరు ఆవిష్కరించడం జరిగినది . ఈ కార్యక్రమములో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ప్రధాన కార్యదర్శి మరియు హోలీ స్వీట్ వ్యవస్థాపకులు పసలపూడి రమేష్ , పృద్వి , వై కోటేశ్వరరావు సిహెచ్ విజయ్ సూశేషం , ప్రభాకర్ , శేషయ్య , రామారావు , వినయ్ , నరేష్ చంటి.నందు అరవింద్ నవదీప్ కుమార్.ఆర్చుత్ పాల్ తదితరులు పాల్గొన్నారు .
