Hyderabad/09.01.2024

మన జ్యోతి పత్రిక తెలంగాణ

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం..తెలంగాణ భవన్.

▪️బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ గారు.

  • స్పీచ్ ముఖ్యాంశాలు. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనం.

39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయి.

ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయాం. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదాం
ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిగిన సంగతి తెలిసిందే. ఖమ్మం సమీక్ష 7 వది.

రాష్ట్రం లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. వచ్చిన తెల్లారినించే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రేస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని ఆ పార్టీ నెల రోజుల పోకడ స్పష్టమౌతున్నది.

వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది.

ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రేస్ పార్టీ సొంతం.

గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే. 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయపరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది.

1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీని తిరస్కరించి కాంగ్రేస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రేస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు.

ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది.

ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీ ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే.

ఈ వాస్తవం మనం మరువగూడదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రేస్ పార్టీ కి వుండదు అనేది గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది.

ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రేస్ పార్టీ మీద వత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.

ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed