


ఖమ్మం ప్రతినిధి మార్చ్ 10 మన జ్యోతి
ఈ సమాజానికి అక్షర బిక్ష పెట్టిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే
గుడూరు సీతామాలక్ష్మి
ఖమ్మం: ఖానాపురం హవేలీ సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చిప్ప సత్యవతి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోడూరు సీతామాలక్ష్మి హాజరై.. ఈ సమాజానికి అక్షరం బిక్ష పెట్టిన తల్లి సావిత్రిబాయి పూలే గారని ఆమె లేకపోతే మనకు ఈ అక్షరమే లేదని..అన్నారు కానీ నేడు ఈ దేశాన్ని పాలిస్తున్న అగ్రకులాలు మళ్లీ మనువాదంతో అణగారిన కులాలకు విద్యను దూరం చేస్తున్న విషయం మనకు తెలిసిందే మళ్లీ విద్యను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉన్నదని. బ్రాహ్మణయ్య మనవాదుల పార్టీలను ఓడించి బహుజన రాజ్యం సాధించుకుంటేనే సావిత్రిబాయి పూలే గారికి ఘనమైన నివారణ అన్నారు.. మరో వక్త లింగన బోయిన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను,పూలేను ఈ అగ్రకుల సమాజం వారి త్యాగాన్ని తెలియకుండా జాగ్రత్త పడిందని.. వారు అందరికీ విద్య కోసం పోరాడితే. ఈ దోపిడీ కులాలు ఆవిద్యాను మన నుండి దూరం చేశాయి… అందుకే అక్షరాన్ని బతికించాలంటే మనం రాజులు కావాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో కొమ్మురమా, కే మాధవి, కటకం వెంకటలక్ష్మి, గొడుగు రమాదేవి, తదిరులు పాల్గొన్న
