







సుప్రీం కోర్ట్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శివమాల దంపతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు
ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలోఅభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం జరిగింది
ఖమ్మం విచ్చేసిన భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ ను గజమాల, దుశ్శాలువతో సత్కరించి బోకే అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ రమణ సేవలను కొని యాడారు. తెలుగు ప్రజలు గర్వించేలా విధులను నిర్వర్తించి ఎంతో కీర్తిని గడించిన జస్టిస్ రమణ ను మంత్రి అభినందించారు.
డాక్టర్ పులిపాటి ప్రసాద్ మిత్రబృందం. కార్యక్రమంలో శ్రీ ఖాసీం, శ్రీ వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, శ్రీ కొంకి మండలం మృత్యుంజయరావు, ప్రతాప్, శ్రీకాంత్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు🌷🌺🌸
