నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి
- ఆర్జేసీ కృష్ణ తనయ దంపతులను ఆశీర్వదించిన గులాబీ బాస్
- కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కృష్ణ దంపతులు
కొత్తగా పెళ్ళైన నూతన దంపతులను గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసారా ఆశీర్వదించారు. ఇటీవల వివాహం జరిగిన ఆర్జేసీ కృష్ణ కుమార్తె ధాత్రి దంపతులకు కేసీఆర్ వివాహ శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు కృష్ణ దంపతులతో పాటు నూతన వధూవరులు సైతం బుధవారం హైదరాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నూతన వధూవరులకు కేసీఆర్ తో పాటు కవిత కూడా వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పూర్వకంగా ఇంటికి వచ్చిన కృష్ణతో పాటు ఆయన కుమార్తె దంపతులకు కూడా కేసీఆర్ పట్టు వస్త్రాలు పెట్టి ఘనంగా సత్కరించారు.




