



కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు ధన్యవాదాలు తెలిపిన కాపు సంఘం నాయకులు
కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేసింది.
మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కొరకు ఎన్నో ఉద్యమాలు చేశాం.
విలేకరుల సమావేశంలో అసంఘం మున్నూరుకాపు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు.
రాష్ట్ర సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి,మంత్రుల క్యాబినేట్ మీటింగ్ లో మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల మున్నూరుకాపు సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు మున్నారుకాపు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీతో కలిసి పారా నాగేశ్వరరావు మాట్లాడారు.
మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ క్యాబినేట్ ఆమోదం కు కృషి చేసిన జిల్లా మంత్రులు మల్లు భట్టివిక్రమార్క,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గత కొన్నేళ్లుగా మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధన కొరకు పోస్ట్ కార్డు ఉద్యమాలు,నిరహారదీక్షలు,బంద్ లు చేపట్టినప్పట్టినప్పటికి గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదన్నారు.
మోసపూరిత మాటలు చెప్తూ కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తదిలే అన్నోళ్లకు,
చెంపపెట్టులా ఉందన్నారు.మున్నూరుకాపు జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారు.చేతి వృత్తుల కులాల వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో,అదేవిధంగా మున్నూరుకాపు ప్రజలకు వ్యవసాయ పనిముట్లపై రాయితీ కల్పించాలని పారా నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్నూరుకాపు కుటుంబాల కు చెందిన పిల్లలకు ఉన్నత విద్యాభివృద్ధికి,ఆర్థికంగా,రాజకీయం గా దామాషా ప్రకారం బలోపేతం కొరకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.సీఎం రేవంత్ రెడ్డికి మున్నూరుకాపు జనాభా ఋణపడి ఉంటారని స్పష్టం చేశారు.
అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్నికల ముందు చెప్పినట్లుగానే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సంఘం రాష్ట్ర కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ ప్రకటించిన ప్రభుత్వం అలంకార ప్రాయంగా కాకుండా అమలును వేగవంతం చేయాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54 శాతం ఉన్న బిసిలలో,24 శాతం ఉన్న మున్నూరుకాపు కులబంధావులకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఆకుల గాంధీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మున్నూరుకాపు పిల్లలకు విదేశీ ఉద్య నిమిత్తం ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
కనిశెట్టి విజయ్ కుమార్,ట్రెజరర్ జాబిశెట్టి శ్రీనివాసరావు,పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు
మారిశెట్టి వెంకటేశ్వరరావు,ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులు
మేకల బిక్ష్మయ్య,ట్రస్ట్ బోర్డ్ కార్యదర్శి కనిశెట్టి నర్సయ్య,ట్రెజరర్
పొన్నం వెంకటేశ్వర్లు,
ఖమ్మం పట్టణ అధ్యక్షులు
మడూరి పూర్ణచందర్ రావు,జిల్లా కార్యవర్గ సభ్యులు
పిన్ని కోటేశ్వరరావు, జిల్లా యూత్ అధ్యక్షులు పారా ఉదయ్,టౌన్ సెక్రెటరీ ముత్యం ఉప్పల్ రావు,టి.విజయ్,కావేరి సాయి,కేదాసు నర్సయ్య,గుండెపునేని నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.
