





దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
దూదేకులం ను ప్రభుత్వం ఆదుకోవాలి
విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా
ఖమ్మం, ప్రతినిధి మార్చి 13 మన జ్యోతి
దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్బాష్ దూదేకుల (బి.సి) ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 18 లక్షల జనాభా కలిగిన దూదేకుల కులాలకు ఇందిరమ్మ రాజ్యంలో తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 16కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాదేకులను కూడా బిసిలుగా పరిగణించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని కాని తెలంగాణలో మాత్రం ఏర్పాటు చేయకపోవడం బాధకరమని అన్నారు. గత ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించిన పట్టించుకోలేదని తమ సమస్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసినా ఏనాడు కూడా గత ప్రభుత్వం చెవిన పెట్టలేదని ఆవేదన వెల్లిబుచ్చారు. దూదేకుల ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం మారాలని ఆదిశగానే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ఓటు అనుకూలంగా పడ్డాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందని భరోసాతో వేడుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి దూబేకుల కులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రహీమ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దానివేగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు షకీనాబీ, జిల్లా అధ్యక్షులు రహీమ్పాషా, నగర అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా సభ్యులు లాల్ సా బ్ సాహెబ్ హుస్సేన్, సిద్దిక్పషా, మదర్శి తదితరులు పాల్గొన్నారు.
