విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్
ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (మన జ్యోతి)
మేమేం పాపం చేశాం ? విశ్వబ్రాహ్మణ సంఘం అనగా 5 పంచ వృత్తుల సంఘాలు కార్పొరేషన్ యొక్క ఆవశ్యకతను గురించి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివరంగా తెలియజేయడం జరిగింది
గత ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు శుభపరిణామం నిన్న 16 కులాలకి కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది అభినందనలు తెలియజేస్తున్నాము కానీ అందులో మా విశ్వబ్రాహ్మణ కులం లేదని చాలా బాధేసింది మొదట దశ నుంచి కూడా తెలంగాణ పోరాటం మా విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు పోరాడుతూనే ఉన్నారు కేసీఆర్ గారు తీసుకొచ్చి జయశంకర్ సార్ ఉద్యమం ఈ రకంగా చేయాలి తెలంగాణ వస్తుంది అని మంచి ఆలోచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లి వ్యక్తి జయశంకర్ సార్ కానీ ఆయన మా మధ్యలో లేకపోవడం దురదృష్టకరం మళ్లీ తెలంగాణ ఉద్యమం బ్రేక్పడి సమయంలో శ్రీకాంత్ చారి ప్రాణ చాగం చేశారు ఆయన మా విశ్వకర్మ ముద్దుబిడ్డ మరింత తెలంగాణ కోసం ముందుండి పోరాడినటువంటి ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు కేసీఆర్ గారు రెండు సార్లు సీఎం చేసినా కూడా విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కమిటీ వారు ఎన్ని సార్లు చెప్పినా కూడా ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు మరి ఈసారి రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి మా విశ్వబ్రాహ్మణ కులానికి కార్పొరేషన్ ప్రకటిస్తారని ఆశిస్తున్నాను త్వరలో ఖమ్మం జిల్లా మంత్రివర్యులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారిని బట్టి విక్రమార్గాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మా కమిటీ త్వరలో కలుస్తాము వాళ్ల ద్వారా కూడా ప్రభుత్వానికి మా విజ్ఞప్తిని కోరుతాము ఇట్లు ఖమ్మం నగర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు గౌరోజు వసంత బాబు ప్రధాన కార్యదర్శి దేశరాజ్ వెంకటేశ్వర్లు కోశాధికారి నందిగామ వీర బ్రహ్మచారి విజయగిరి సదానంద చారి విశ్వనాధుల పాపాచారి బాణాల వీర బ్రహ్మచారి కొమరగిరి రామాచారి సోమ నాగరాజు కొనపర్తి రాజేశ్వరరావు గారు మరియు నగర కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed