







సాగు, త్రాగు నీరు తక్షణమే విడుదల చేయాలి..
– సాగర్ జలాలతో పాలేరు జలాశయాన్ని వెంటనే నింపాలని డిమాండ్.
– ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రజలు, రైతులు త్రాగు, సాగు నీరు తక్షణమే విడుదల చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు.
సాగు,నీరు లేక పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేకుండా మిన్నకుండి పోయింది అని ద్వజమేత్తారు.
పాలేరు జలాశయంను తక్షణమే నింపాలని జిల్లా BRS నేతలు పాలేరు జలాశయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్లకార్డ్స్ పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
తొలుత ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్వర్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మాజి ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య గారు, బానోత్ మధన్ లాల్, చంద్రావతి గారు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎండిపోయిన వారి పంట ను పరిశీలించి రైతులు, కూలీలతో మాట్లాడారు.
రైతులు, ప్రజల పక్షాన ఉండి వారికి అండగా ఉంటామని, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదదీసి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో పాలన చేతకాక ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందేకాక, సాగుత్రాగు నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడం విచారకరం అన్నారు.
ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని తాగు, సాగునీరు కొరకు వెంటనే సాగర్ జలాలతో నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, వివిధ రైతులు తదితరులు పాల్గొన్నారు.
