



నామ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
10 ఏళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి
కార్యకర్తలకు అండగా ఉంటా
తల్లాడలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య
జెండా.. అజెండా ఒక్కటే…కారు గుర్తుకు ఓటేసి నామ నాగేశ్వరరావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోవలని మంగళవారం తల్లాడ లో జరిగిన బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి బూత్ లో ప్రతి ఒక్కరూ నామ గా భావించి,సైలెంట్ గా ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. ఎవరికి వారు గ్రామంలో బాధ్యతతో పని చేసి, తనను గెలిపించి, కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, కాపాడుకుంటానని అన్నారు. కష్ట కాలంలో పార్లమెంట్ స్టానాన్ని గెలిపించుకోవాన్నారు. 10 ఏళ్ల అభివృద్ధి ని ప్రజల్లోకి తీసికెళ్లి, ఓట్లు అడగాలన్నారు. 17వ లోక్ సభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తనకు 32 వేల ఓట్ల మేజర్టీ వచ్చిందని, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం తో పని చేసి, ఆ మెజార్టీని మించాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి లో తన ముద్ర ఉందన్నారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం 120 లేఖలు కేంద్రానికి రాసినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించడం జరిగిందని తెలిపారు. తాను రైతు బిడ్డను.. కళ్లారా ప్రజల కష్టాలు చూశాను. గతంలో సాగు, తాగు నీరు, కరెంట్ కోసం ధర్నాలు చేసిన చరిత్ర తెలియందికాదన్నారు. తనను గెలిపిస్తే తెలంగాణ, జిల్లా ప్రజల వాణి పార్లమెంట్ లో వినిపించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ నామ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు.ప్రతి బూత్ లో అందరూ బాధ్యతతో పని చేయాలన్నారు. మంచి మెజార్టీ సాధించి, కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలన్నారు.చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉందని, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆ పార్టీని గెలిపించారని అన్నారు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారని, నామ గెలుపు తధ్యమన్నారు. మండల పార్టీ అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, శ్రీయుతులు దొడ్డా శ్రీనివాసరావు, వెంకట్ లాల్, దిరిశాల ప్రమీల , నాగ శ్రీనివాసరావు, వీరారెడ్డి, ఆశీర్వాదం, తదితరులతో పాటు ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
